గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. చైనాలోని వూహాన్ నగరంలో మొదటిసారి కరోనా బయటపడిన తరువాత ఈ వైరస్ అనేక రకాలుగా మార్పులు చెందుతూ దాడులు చేస్తూనే ఉన్నది. సార్స్ కోవ్ 2, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ఇబ్బందులకు గురిచేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అయితే, మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌ను కనుగొన్న తరువాత మరణాల సంఖ్య తగ్గింది. సాధారణంగా కరోనా వైరస్ మనిషి శరీరంలో రెండు వారాల వరకు ఉంటుంది.…
యూఎస్‌లో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సిన్, మూడో డోసు కింద బూస్టర్ డోస్ లను అందిస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్ వేవ్‌ల సమయంలో యూఎస్‌లో కేసులు భారీగా నమోదయ్యాయి. కేసులతో పాటు పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ కేసులు పెరగడం, వ్యాక్సిన్‌లను తట్టుకొని వైరస్ మహమ్మారి దాడులు చేస్తుండటంతో నాలుగో డోస్ కింద మరోసారి బూస్టర్ డోసులు ఇచ్చేందుకు యూఎస్ రంగం సిద్దం చేసుకుంటోంది. దీనిపై అంటువ్యాధుల…
కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ టీకాలను తీసుకుంటున్నారు. కరోనా నుంచి ప్రస్తుతం ప్రపంచాన్ని కాపడగలిగేది టీకాలు మాత్రమే కావడంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లో వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతకాలం తరువాత వ్యాక్సిన్ నుంచి రక్షణ తగ్గిపోతుంది. అయినప్పటికీ కరోనా వైరస్‌ను నుంచి రక్షణ కల్పించడంతో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్యను తగ్గిస్తున్నాయని తాజా రీసెర్చ్‌లో తేలినట్టు స్వీడన్ పబ్లిక్ హెల్త్…
ఆఫ్రికాలోని బోట్స్‌వానాలో మొదటి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఈ వేరియంట్ క్రమంగా ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉన్నది. మరణాల సంఖ్య సైతం తక్కువగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలు దేశాల్లో వివిధ వేవ్‌లకు ఒమిక్రాన్ కారణమైంది. తీవ్రత తక్కువగా ఉండటానికి గల కారణాలను పరిశోధకులు పరిశోధించారు. డెల్టా వేరియంట్…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా కేరళ రాష్ట్రంలో కేసులు భారీ సంఖ్యలో నమోదువుతున్నాయి. కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 51,887 కరోనా కేసులు నమోదైనట్టు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1205 మంది మృతి చెందారు. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయింది. కేరళలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు మరింత కఠినంగా నిబంధనలు అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు. Read: నావికా…
తెలంగాణలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ కారణంగా 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. అయితే, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతదూరం వెళ్లి క్యూలైన్లో నిలబడి వ్యాక్సిన్ తీసుకోవాలంటే అయ్యేపనికాదు. వీరికోసం జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే డైరెక్ట్‌గా వారి ఇంటికి వచ్చి బూస్టర్ డోసు…
గత రెండేళ్లుగా దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది. కరోనా నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. కానీ, చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంలో నైట్ కర్ఫ్యూతో పాటు వీకెంట్ లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నాయి. మందుబాబులు వ్యాక్సిన్ విషయంలో నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారు.…
కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న రక్షణ కావడంతో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయించారు. చాలా దేశాల్లో 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసుల అందిస్తున్నారు. బూస్టర్ డోసులు తీసుకున్నవారిలో యాంటిబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు టెక్సాస్ యూనివర్శిటి వైద్య విభాగం కీలక పరిశోధన చేసింది. ఫైజర్ టీకాను తీసుకున్నవారి…
యూపీలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు విడతల ఎన్నికల కోసం యూపీ అధికారులు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం అధికారులు పల్లె ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, బలియా జిల్లాలో అత్యల్పంగా వ్యాక్సినేషన్ జరిగింది. అక్కడి ప్రజలు వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. దీంతో అధికారులు బతిమాలి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే,…
కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున టీకాలు అందిస్తున్నారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్, హెల్త్‌కేర్ వర్కర్లు, కరోనా వారియర్స్‌కు టీకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు త్వరలో బహిరంగ మార్కెట్లోకి రాబోతున్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తయారీ సంస్థలు బహిరంగ…