కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ టీకాలను తీసుకుంటున్నారు. కరోనా నుంచి ప్రస్తుతం ప్రపంచాన్ని కాపడగలిగేది టీకాలు మాత్రమే కావడంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లో వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతకాలం తరువాత వ్యాక్సిన్ నుంచి రక్షణ తగ్గిపోతుంది. అయినప్పటికీ కరోనా వైరస్‌ను నుంచి రక్షణ కల్పించడంతో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్యను తగ్గిస్తున్నాయని తాజా రీసెర్చ్‌లో తేలినట్టు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పేర్కొన్నది.
Read: వైరల్: ప్రాణాలకు తెగించి శునకాన్ని కాపాడిన పోలీస్…శభాష్ అంటున్న నెటిజన్లు…
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందే సామర్థ్యం, క్షీణత అన్నది వ్యాక్సిన్ రకాలను బట్టి ఉంటుందని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తెలియజేసింది. రెండో డోసు తీసుకున్న ఏడు నెలల తరువాత వ్యాక్సిన్ సామర్థ్యం క్షీణిస్తున్నప్పటికీ కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్నదని ఇది నిజంగా గుడ్‌న్యూస్ అని స్వీడన్ ఉమేనియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఆరునెలల తరువాత ఫైజర్ రక్షణ సామర్థ్యం 29 శాతంగా ఉంటే, మోడెర్నా సామర్థ్యం 59శాతంగా ఉన్నట్టు నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 9 నెలల తరువాత తప్పని సరిగా మూడో డోస్ లేదా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.