దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లుదాటిన వృద్దులకు బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. బూస్టర్ డోసులపై తాను ఇచ్చిన సలహాను కేంద్రం స్వీకరించిందని, ఇది మంచి నిర్ణయమని అన్నారు. బూస్టర్ డోసుల రక్షణ ప్రతి ఒక్కరికి చేరాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. …
వైద్య, ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా వుందన్నారు. ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కళ. రామలింగన్న కోరిక.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వరం దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దుబ్బాక మీద చాలా ప్రేమ వుందన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి సంతోషిస్తాడు. స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో కాని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ రక్షణ వ్యవస్థను దాటుకొని విజృంభిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలపై కర్ణాటక సర్కార్ నిషేధం విధించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. కాగా, హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జనవరి 1 తరువాత పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారిని రోడ్డు మీదకు రాకుండా కట్టడి…
వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని, పిల్లలు పుట్టరనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అంటే సరిలే అనుకోవచ్చు. కానీ, అభివృద్ది చెందిన ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహిస్తున్నారు. లండన్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. Read: తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు నమోదు ప్రస్తుతం లండన్‌లో ఇంగ్లీష్ ప్రీమియం ఫుట్‌బాల్ లీగ్…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటున్న వేళ పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని అంతా కోరుకుంటున్నారు. WHO కోవా వ్యాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో చిన్నారుల్ని ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు అవకాశం ఏర్పడింది. పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాను రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కోవోవాక్స్ ట్రయల్ జరుగుతున్నాయి. టీకా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా నుంచి కాపాడుతుందని వైద్యరంగ నిపుణులు…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. వేగంగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశారు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నో రకాల వ్యాక్సిన్ల అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పనితీరుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. దీనికి కారణం హాంకాంగ్ శాస్త్రవేత్తలు అందించిన సర్వే అని చెప్పవచ్చు. చైనాకు చెందిన సీనోఫామ్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసింది. కోట్లాది మంది ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. …
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. యూరప్ దేశాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. అలానే, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు అధికమవుతున్నాయి. ఆసియా దేశాల్లోనూ ఇంచుమించు ఇదేవిధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటు వస్తున్న న్యూజిలాండ్ దేశంలోనూ కరోనా భయం పట్టుకుంది. కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ను వేగం చేశారు. Read: ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి ఇదే……
ప్రపంచం మొత్తంమీద ప్రస్తుతం కరోనాతో అత్యంత ఇబ్బందులు పడుతున్న దేశం ఏంటని అంటే బ్రిటన్ అని టక్కున చెప్పేస్తున్నారు. సౌతాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్‌లు ఇప్పుడు అత్యధికంగా బ్రిటన్‌లోనే కనిపిస్తున్నాయి. రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశం అప్రమత్తం అయింది. గతంలో విధించిన లాక్‌డౌన్ ల దెబ్బకు ఆర్థికంగా కుదేలైంది. ప్రజలను మహమ్మారుల నుంచి బయటపడేసేందుకు ప్రస్తుతం ఆంక్షలు అమలు చేస్తున్నది. Read: యూరప్‌ను వణికిస్తున్న ఒమిక్రాన్… ఫ్రాన్స్‌లో…