తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది.. బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, వృద్ధుల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్నవారు, మృతుల సంఖ్య పెరగడం.. వైద్యవ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది. మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.…
దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే తొలిరోజే టీకా పంపిణీలో సరికొత్త రికార్డు సృష్టించింది భారత్. ఆయా రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 75 లక్షల మందికి టీకాలు అందించారు. ఏప్రిల్ 2న 42 లక్షల 65 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉండేది. రాష్ట్రాలకు కేటాయించిన 25 శాతం వ్యాక్సిన్‌లను వెనక్కి తీసుకున్న కేంద్రం.. అందరికీ ఫ్రీ టీకా అంటూ…