ఇవ్వాల్సిన సమయానికి సెకండ్ డోస్ వేయకపోతే వ్యాక్సిన్ వృథా అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్‌కు పరిష్కారం అన్నారు.. వ్యాక్సినేషన్‌లో ఇంకా చాలాదూరం మనం వెళ్లాల్సి ఉందన్న ఆయన.. సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అసలు ఇవ్వాల్సిన టైంలో వారికి సెకండ్‌డోస్ ఇవ్వకపోతే వ్యాక్సిన్ వృథా అవుతుందని సూచించారు.. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. మిగిలిన కేటగిరీలపై దృష్టిపెట్టాలని…