నటుడు ఉత్తేజ్ పేరు వింటే ఇప్పటికీ ఆయన తొలి చిత్రం శివలోని యాదగిరి పాత్రనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా మొదటి సినిమాలోనే కనిపించింది కొన్ని నిమిషాలే అయినా, తన ప్రతిభతో ఆకట్టుకున్నారు ఉత్తేజ్. రామ్ గోపాల్ వర్మ అప్పటి నుంచీ తాను రూపొందించిన పలు చిత్రాలలో ఉత్తేజ్ కు అవకాశాలు కల్పించారు. గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలలోనూ ఉత్తేజ్ యాదగిరిగానే కనిపించి ఆకట్టుకోవడం విశేషం. ఇలా ఒకే పాత్రలో వేర్వేరు చిత్రాలలో నటించడం అన్నది ఉత్తేజ్…