ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మేథావి వర్గం ఆలోచనలను పసిగట్టకుండా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాయనే చర్చ విస్త్రతంగా జరుగుతోంది. వైఫల్యం ఎక్కడ జరిగింది ? బాధ్యులు ఎవరనే పోస్ట్ మార్టం మొదలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.