కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ ధామ్ యాత్రను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చార్ ధామ్ యాత్రలో వర్షం, మంచు కురుస్తున్న దృష్ట్యా ఆదేశాలు జారీ చేశారు.
ఆరోపించిన రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు, పేపర్ లీక్ కేసులకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం పరీక్షలలో కాపీ చేసిన వారికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని అన్నారు.
ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్, ఆపరేటర్‌ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు.