సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ స్థానికాలయాల్లో వివిధ విశేష ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 7న గోకులాష్టమి సందర్బంగా ఎస్వీ గోశాలలో గోపూజ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9న తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శిక్యోత్సవం(ఉట్లోత్సవం) జరగనుంది. సెప్టెంబరు 10న శ్రీ గోవిందరాజస్వామివారి చిన్నవీధి శిక్యోత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 11న శ్రీ గోవిందరాజస్వామివారి పెద్దవీధి శిక్యోత్సవం, సెప్టెంబరు 18న వినాయక చవితి రోజున శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబరు 24 నుండి 27వ…