రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు. పుతిన్ ఉద్దేశమేంటో అర్థమవుతోందని.. పగలు చాలా అందంగా మాట్లాడతాడని. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతాడని... అలాంటి ప్రవర్తన తనకు నచ్చట్లేదని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్పై దర్యాప్తును ముగించాలని న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయంపై అంతర్గత ఉద్రిక్తతల నేపథ్యంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ రాజీనామా చేయబోతున్నట్లు పుకార్లు వ్యాప్తి చెందాయి.
గాజాపై ఇంకా యుద్ధం ముగియలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా స్పీకర్‌తో సమావేశం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విలేకరులతో మాట్లాడారు. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యా్న్ని ఇజ్రాయెల్ పూర్తి చేస్తుందని తెలిపారు.
అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం తెలిపారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అగర్వాల్ ముఖ్య సంధానకర్తగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపారు.
ఆకస్మిక వరదలు టెక్సాస్ నగరాన్ని ఘోరంగా దెబ్బకొట్టింది. ఊహించని రీతిలో వరదలు సంభవించడంతో టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది. నెలల తరబడి కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల్లోనే కురవడంతో నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తేశాయి.
నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని.. దాన్ని పొందాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని నెతన్యాహు కొనియాడారు.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ బుధవారంతో ముగుస్తోంది. కానీ ఇంతలోనే వాణిజ్య భాగస్వామ దేశాలైన జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ రెండు దేశాలకు రాసిన లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు.. కారును ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు 10 శాతం అదనంగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ట్రంప్.. దేశాలపై సుంకాలు విధించారు. ఈ చర్యను బ్రిక్స్ దేశాలు ఖండించాయి.