ఉక్రెయిన్-రష్యా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఇరు దేశాల మధ్య మళ్లీ భీకరమైన యుద్ధం సాగేలా సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్.. రష్యాపై ప్రయోగించింది.
ఉక్రెయిన్ – రష్యా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులకు కేంద్రం పలు సూచనలు చేసింది. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న వందలాది మంది తెలుగు విద్యార్ధులు. తల్లితండ్రులు ఆందోళనలో వున్నారు. ఉక్రెయిన్‌లో ఉండాల్సిన అవసరం లేని భారతీయ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సలహా ఇచ్చింది. ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్ధులు భారత్ దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్ లోని భారత దౌత్యకార్యాలయం…