H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తమ తల్లిదండ్రుల్ని, కుటుంబాలను కలవడానికి వచ్చిన వారు, పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారు అయోమయ స్థిలో పడ్డారు. తమ వివాహాలను రద్దు చేసుకుని, మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు. హెచ్1బీ వీసాల రుసుము 1,00,000 డాలర్లు(రూ. 88 లక్షలు)కు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టాడు.
దేశాలపై సుంకాలతో ట్రేడ్ వార్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ లిస్ట్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇతర దేశాలు ఉన్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ సర్కార్ మొత్తం 41 దేశాలతో మూడు జాబితాలను సిద్ధం చేసిందని తెలిపింది. మొదటి జాబితాలో 10 దేశాలు చేర్చబడ్డాయని,…