Pakistan: పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను బయటపెట్టుకోవడంలో ఆ దేశం ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. తాజాగా, పహల్గామ్ ఉగ్రవాడికి బాధ్యత వహించిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’కు మద్దతు తెలుపుతోంది. ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో నాన్-పర్మినెంట్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రస్తావనను నిరోధించింది.