అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థాన్ ఉగ్రవాది పన్ను హాజరుకావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కనిపించడంపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయాన్ని అమెరికాతో భారత్ లేవనెత్తుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికాతో భారత్ లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన శుక్రవారం తెలిపారు.