అమెరికాలో ఎట్టకేలకు సుదీర్ఘ షట్‌డౌన్ ముగిసింది. ఈ మేరకు 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. షట్‌డౌన్‌ను ముగించే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దీంతో 43 రోజుల సుదీర్ఘ షట్‌డౌన్‌కు అధికారికంగా ముగింపు లభించింది.
America vs Iran: ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు మధ్యప్రాచ్యాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదో ప్రమాదకరమైన ప్రాంతం అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని యూఎస్ తెలిపింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. 104 మంది భారతీయులు పంజాబ్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. ఈ అంశంపై మొదటిసారిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం దేశాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ప్రకటించిన 104 మంది భారతీయులు బుధవారం పంజాబ్‌లోని అమృత్సర్‌కు తిరిగి వచ్చారు. ఆ విమానం బుధవారం శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
US Government: సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు జో బైడెన్ ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ (పార్లమెంటు హౌస్ ) గురువారం నాడు తిరస్కరించింది.
అమెరికాలోని వైట్‌హౌస్‌లో ఏటా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. బరాక్ ఒబామా, ట్రంప్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ వరకు అందరూ దివాళి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి రోజున న్యూయార్క్‌లోని పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఇదే మొదటి సారి. న్యూయార్క్ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
804,000 మంది రుణగ్రహీతలకు మొత్తం విద్యార్థుల రుణ ఉపశమనంలో $39 బిలియన్లను అందజేస్తామని బిడెన్ పరిపాలన ప్రకటించింది, అధ్యక్షుడు బిడెన్ విద్యార్థి రుణ మాఫీ ప్రణాళికను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటి నుండి దాని తాజా దశ. 20 లేదా 25 సంవత్సరాల పాటు రుణగ్రహీత చెల్లింపులు చేసిన తర్వాత వారికి మిగిలిన బ్యాలెన్స్‌లను ఫెడరల్ ప్రభుత్వం రద్దు చేసే ఆదాయ ఆధారిత రీపేమెంట్ ప్లాన్‌లపై ఉపశమనం అందించబడుతుందని విద్యా శాఖ శుక్రవారం తెలిపింది.. పరిష్కారాలు..ప్లాన్‌ల క్రింద అర్హత పొందే…