Tulsi Gabbard: అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే ముందే తన టీమ్‌ని ఖరారు చేసుకుంటున్నాడు. తాజాగా మాజీ డెమొక్రాటిక్ ప్రతినిధి నుంచి ట్రంప్ మద్దతుదారుగా మారిన తులసీ గబ్బార్డ్‌ని తన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె కింద మొత్తం అమెరికాలోని 18 గూఢచార ఏజెన్సీలు పనిచేస్తాయి.