H-1B visa: H-1B వీసా ఫీజును పెంచుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు(రూ. 88లక్షలు) ఫీజు విధించాడు. ముఖ్యంగా, దీని ప్రభావం భారతీయ టెక్కీలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, మొత్తం హెచ్1బీ వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. అయితే, హెచ్1బీ వీసాల విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
US-India Trade Deal: భారత్, అమెరికా మధ్య త్వరలో ‘‘వాణిజ్య ఒప్పందం’’ ఖరారు కావచ్చని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఈ వారం న్యూఢిల్లీలో జరిగే భారత్-అమెరికా చర్చల చివరి రౌండ్ సమావేశాలకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ‘‘ఇరు దేశాలు కలిసి పనిచేసే స్థలాన్ని కనుగొన్నాము కాబట్టి, త్వరలోనే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం వస్తుందని మీరు ఆశించాలి’’ అని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (యుఎస్‌ఐఎస్‌పిఎఫ్) ఎనిమిదవ ఎడిషన్‌లో లుట్నిక్…