US – China: ఉప్పు – నిప్పులా ఉన్న అమెరికా – చైనా మధ్య కొత్త చర్చలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము…
S*x Warfare: టెక్ కంపెనీల రహస్యాలను, ట్రేడ్ సీక్రెట్లకు సంబంధించిన రహస్యాలను సేకరించడానికి కొత్త తరహా ‘‘గూఢచర్యం’’ జరుగుతోంది. ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీకి సంబంధించిన పలు కంపెనీల వివరాలను సేకరించడానికి చైనీస్, రష్యన్లు ‘‘సె*క్స్ వార్‌ఫేర్’’ను ప్రారంభించారు. అందమైన, ఆకట్టుకునే మహిళల్ని వాడుకుని, ఉద్యోగుల నుంచి వివరాలను రాబడుతున్నారు.
CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ…