Greenland: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలు సంచలనంగా మారాయి. గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు.