మహానటి అన్న పదానికి నిలువెత్తు రూపం నటి శారద. ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటి అవార్డును ‘ఊర్వశి’ అవార్డుగా పిలిచేవారు. అలా ఆ అవార్డును రెండు సార్లు సొంతం చేసుకున్న ఏకైక నటీమణిగా శారద నిలిచారు. మూడో సారి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి మొత్తం మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక దక్షిణాది నటిగానూ ఆమె కొనసాగుతున్నారు శారద అసలు పేరు సరస్వతీదేవి. 1945 జూన్ 25న తెనాలిలో జన్మించారు శారద.…