ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ క్లోస్ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు క్షణాల్లో మాల్ మొత్తం వ్యాపించాయి.
ఆన్ లైన్ గేమ్ లు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తాయో నిత్యం వింటూనే ఉన్నాం.. ఆడ, మగ తేడా లేకుండా అందరు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ ల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతుంది..పక్కింట్లో ఎవ్వరు లేరని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చోరికి పాల్పడింది.. అనుమానంతో పోలీసులు విచారించగ అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది.. రామంతాపూర్ ఇందిరానగర్…
సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ మళ్లీంచనున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆ జిల్లా మంత్రులు ఒక్కటై తిరుగుబాటు చేయడం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది. ముందెన్నడూ లేనివిధంగా బహిరంగంగా ఓ మంత్రిపై జిల్లా ఎమ్మెల్యేలంతా తిరగబడటం ఆ పార్టీలో సంచలనంగా మారింది. మార్కెట్ కమిటీ నియామకం వివాదంలో.. మంత్రి మల్లారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఆ రహస్య సమావేశానికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజే శంకుస్థాపనకు వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మీకి అవమానం జరగడం.. పార్టీలో తీవ్ర చర్చగా మారింది.…
Hyderabad Metro: ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ట్రిప్పులు నడిపింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని గతంలోనే ప్రకటించగా… అభిమానులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం…