హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారని ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ 19, అండర్ 23 లీగ్‌లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మంచి ప్రదర్శన చేసినా తన కుమాడిని ఆడనివ్వలేదని, సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఓ ప్లేయర్ తండ్రి డాక్టర్ రామారావు…