Decreasing use of debit cards: క్యాష్ లెస్ లావాదేవీల వైపు దేశం పరుగుపెడుతోంది. గతంలో పోలిస్తే కొన్నేళ్లుగా నగదు వినియోగం తగ్గిపోయి అంతా యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కు అలవాటు పడ్డారు. రూపాయి దగ్గర నుంచి లక్షల వరకు లావాదేవీలన్నీ ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా జరుగుతున్నాయి. చివరు ఏటీఎంలలో కూడా నగదు తీసుకోవడానికి కార్డు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర నమోదైంది. 2022 జూలైలో 6 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2016 తర్వాత అంటే గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు 2019 అక్టోబర్‌లో తొలిసారి 1 బిలియన్ మార్క్‌ను దాటాయి.