మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తాను గర్భవతిగా ఉన్నందున అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయానని తెలిపారు. ఈ గుర్తింపు మరింత ఎక్కువగా పనిచేయడానికి, తమ పరిమితులను అధిగమించడానికి ప్రేరణనిస్తుందని ఉపాసన పేర్కొన్నారు. బిజినెస్ కార్యకలాపాలతో పాటు వ్యక్తిగత విషయాలను…