UP Serial Killer: గతేడాది కాలంగా ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా మహిళల హత్యలు సంచలనంగా మారాయి. 40-45 ఏళ్ల మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలు జరిగాయి. పంట చేలు, చెరుకు తోటల్లో పనిచేస్తున్న మహిళల గొంతుకు చీరని బిగించి, గొంతు నులిమి హత్యలు జరిగాయి. మొత్తం 13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు ఒకే విధంగా జరిగాయి.
Serial Killer: ఉత్తర్ ప్రదేశ్ బరేలీ జిల్లాలోని పలు గ్రామాల్లో వరసగా మహిళల హత్యలు సంచనలంగా మారాయి. దాదాపుగా 13 నెలల వ్యవధిలో ఒకే వయసులో ఉన్న 9 మంది మహిళలు ఒకే తరహాలో హత్య చేయబడ్డారు. దీంతో ‘సీరియల్ కిల్లర్’ ఈ హత్యలకు పాల్పడుతున్నాడనే అనుమానం కలుగుతోంది. పోలీసులు ఈ దిశగా దృష్టి సారిస్తు్న్నారు. మహిళలందర్ని ఒకే రీతిలో చీరతో గొంతుకు ఉరేసి చంపుతున్నాడు.