Samajwadi Party: హర్యానా ఎన్నికల ఓటమి కాంగ్రెస్ పార్టీపై బాగానే కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై సమీక్ష చేసుకోవాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు.