పీసీసీ హోదాలో వున్న రేవంత్ రెడ్డి ఇంటి పెద్దమనిషిగా వ్యవహరించాలని, 24 గంటలు సర్వీస్ ఇవ్వాల్సిందే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటని, అసమ్మతి కాంగ్రెస్ లో సహజమని, అన్ని పార్టీలలో అసమ్మతి ఉంటుందని అన్నారు.