వైస్ ఛాన్స్‌లర్స్ లేకుండా తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఇంకెన్నాళ్ళు అలా ఉండాలి? నియామకం విషయంలో ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదా? పది వర్శిటీలకు పాలక మండళ్ళు లేకుంటే...ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నట్టు? విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామన్న మాట నిలబెట్టుకునేది ఇలాగేనా? వీసీల ఎంపికలో ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదేంటి? సీరియస్ ఎపిసోడ్‌ని లైట్ తీసుకుంటున్నారన్న విమర్శల్లో నిజమెంత?