ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య ధీమాను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..