ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లను అంతు చిక్కని వ్యాధి పట్టి పీడిస్తోంది. రోజు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆరోగ్యంగా కనిపించే కోడి గంటల వ్యవధిలో మృత్యువాత పడుతోంది.. డిసెంబర్ లో మొదలైన వైరస్.. జనవరి 13తర్వాత విజృంభించింది. H15N వైరస్ లక్షణాలతో రోజూ వేల సంఖ్యలో చనిపోతున్నాయి. వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.