కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్ధిని వివరించారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం అన్నారు..
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు,…