కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,071 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 955 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 52,299 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 2,96,58,078కి పెరిగాయి……
ఇప్పుడు రెండింటిపైనే ప్రధాన చర్చ.. ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ అయితే.. మరోటి.. దానికి చెక్ పెట్టే వ్యాక్సినేషన్… ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రకారం.. నిర్ణీత కాల వ్యవధిలో ఒక్కొక్కరు రెండు డోసులు తీసుకోవాలి.. అయితే, ఇప్పుడు పరిస్థితి కొంత గందరగోళంగా తయారైంది.. ఫస్ట్ డోస్‌గా కొవాగ్జిన్ తీసుకున్న చోట.. ఇప్పుడు కొవిషీల్డ్ టీకా అందుబాటులో ఉంది.. దీంతో.. ఫస్ట్‌డోస్ అది వేసి.. సెకండ్ డోస్ ఇది వేస్తే ఎలా ఉంటుంది? అసలు…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి… రికవరీ రేటు పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేసింది కేంద్రం… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్… పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. మే 3వ తేదీన రికవరీ రేటు 81.7 శాతం ఉందన్న ఆయన.. ఇప్పుడు అది 85.6 శాతానికి చేరిందన్నారు. ఇక, గత 24 గంటల్లో కోవిడ్నుం చి 4,22,436 మంది కోలుకున్నట్టు వెల్లడించారు లవ్ అగర్వాల్.. దేశంలో ఇంత భారీ…
కరోనాను కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు ప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన పెరిగినా.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన మొదట్లో.. ఆది తీసుకోవడానికి వెనుకడుగు వేసినవారు ఎందరో.. ఇప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్ భయం లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం.. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారు.. వ్యాక్సినేషన్ తర్వాత కొందరు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్తలు హల్ చల్ చేశాయి.. అయితే, భారత్‌లో వ్యాక్సిన్లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్…
కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు భారత్‌లో 45 ఏళ్లు పైబడినవారికి వేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తారు.. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోందని కేంద్రం ప్రకటించింది.. కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.. వేగంగా కరోనా టీకాలు ఇచ్చిన దేశం మనదేనని.. అదే…