Declining Rice Production: దేశంలో ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సారి దేశంలో 12 మిలియన్ టన్నుల మేర వరి ఉత్పత్తి తగ్గవచ్చని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తక్కవగా కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో ఇప్పటి వరకు వరి స్టాక్ మిగులు ఉందని వెల్లడించారు.