ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయాలు హీటెక్కాయి. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ డాక్టర్ సయ్యద్ తుఫైల్ హసన్ (ఎస్టీ హసన్) సంచలన కామెంట్స్ చేశాడు. యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం..
ఉమ్మడి పౌర స్మృతి( యూసీసీ ) బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.
Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ సిద్ధమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని క్యాబినెట్ ఆదివారం ఆమోదించింది. ఫిబ్రవరి 6 ఈ బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. డెహ్రాడూన్‌లో సీఎం ధామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని కేంద్ర సర్కార్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరాడు.