మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం ఇచ్చింది. దిగుమతి చేసుకున్న క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో యువత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలు.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని అన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఈటల ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని పేర్కొన్నారు.
Cyber frauds: సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్లతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా..
TSRTC MD VC Sajjanar: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ అన్నారు.
విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అంటూ నిరుద్యోగులను నమ్మించి వారి దగ్గరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి.. తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనగానే.. నిరుద్యోగులు వారికి భారీ ఎత్తున ముట్టజెప్పారు. ఇదే అదునుగా భావించిన నకిలీ పోలీసులు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది.
Mallu Bhatti Vikramarka: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, చెప్పి మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు సంబంధించి.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు.