‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుంటాను అని పేర్కొన్నారు. కార్యకర్తలే తన కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు. వారు చెప్పినట్టుగానే చెస్తాను.. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తా అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో వర్గపోరు రాజుకుంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుపై మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు మండిపడ్డారు. భీమవరంలోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో.. ఎన్నికల్లో ఏ మాత్రం సహకరించేది లేదంటూ స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఆఫీసు నుంచి రామరాజును శివ వర్గం బయటకి పంపించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు వ్యతిరేకంగా శివవర్గం నినాదాలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ నెగ్గని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి వర్గపోరు తీవ్రంగానే ఉంది. పార్టీ బలోపేతానికి ఇంఛార్జ్ పదవులు చేపడుతున్న నేతలు.. కేడర్‌ను పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మూడుసార్లు ఇంఛార్జులను మార్చారు. అయిన్పటికీ పరిస్థితి మొదటికొస్తుంది తప్పితే మార్పు లేదట. గత ఎన్నికల్లో ఓడిన పీవీఎల్ నరసింహరాజును ఆ మధ్య ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు. తాజాగా మళ్లీ ఆయనకే పగ్గాలు ఇచ్చారు. దీంతో…