Craziest CT Scans: అమెరికాలో ఓ వ్యక్తికి సంబంధించిన సీటీ స్కాన్ వైరల్‌గా మారింది. ఉడకని పంది మాంసం తిన్న వ్యక్తి జబ్బు పడటంతో ఆస్పత్రిలో చేరాడు. అతడి సీటీ స్కాన్‌ని వైద్యులు విడుదల చేశారు. స్కాన్ రిపోర్టులో రోగి కాళ్లలో తీవ్రమైన ‘‘పరాన్నజీవి’’ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఫ్లోరిడా హెల్త్ జాక్సన్‌విల్లే యూనివర్శిటీకి చెందిన ఎమర్జెన్సీ డాక్టర్ సామ్ ఘాలీ రోగికి వచ్చిన జబ్బును గుర్తించాలని స్కాన్ రిపోర్టును ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు