ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ తగిలింది. అండర్-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అటు ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది. అండర్-19…