టీమిండియా క్రికెట్ ను సచిన్ ముందు, సచిన్ తర్వాత అన్నట్టుగా విడదీయొచ్చు. బౌలర్లు ఆధిపత్యం చెలాయించే ఆ రోజుల్లో ఓ పదహారేళ్ళ కుర్రాడు ప్రపంచ క్రికెట్ ని వణికించేశాడు. పదహారేళ్లకు తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి బౌలర్లకు నైట్ మెర్ గా మారాడు. అంతకుముందు 15 ఏళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్లోతారాజువ్వగా దూసుకొచ్చాడు. ఇప్పుడు పద్నాలుగేళ్లకే డబుల్ సెంచరీలతో మోత మోగిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్…