ఫిబ్రవరి నెల నిజానికి సినిమా వాళ్ళకు డ్రై మంత్. ఎగ్జామినేషన్ ఫీవర్ మొదలు కావడంతో పేరెంట్స్ అంతా పిల్లల చదువుపై దృష్టి పెడుతుంటారు. అయితే సంక్రాంతి సీజన్ మిస్ చేసుకున్న వాళ్ళు, మార్చిలో పెద్ద సినిమా విడుదల కారణంగా తమకు థియేటర్లు దొరకవని భావించిన వారు ఫిబ్రవరి నెలలోనే తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు. అందులో సహజంగానే చిన్న చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి మొదటి వారాంతంలో ఏడు సినిమాలు విడుదల కాగా, గత వారం ఓటీటీ…
ప్రపంచంలో అమెరికా తరువాత భారతదేశం సినిమాలను ఉత్పత్తి చేయడంలో మేటిగా నిలుస్తోంది. కొన్నిసార్లు అమెరికాతోనూ పోటీకి సై అంటోంది. ప్రస్తుతం మన ఇండియన్ మూవీస్ కు ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు అమెరికాలో విశేషాదరణ లభిస్తోంది. అదే తీరున హాలీవుడ్ మూవీస్ కూడా మన దేశంలో పలు భారతీయ భాషల్లో అనువాదమై ఆదరణ సంపాదిస్తున్నాయి. అసలు సిసలు సినీ అభిమానులు భారతదేశంలో ఉన్నారన్న సత్యం ప్రపంచానికి బోధపడింది. అందువల్ల మన భారతీయులన ఆకర్షించడానికి, మన దేశాన్ని…