ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోమవారం నిర్వహించిన "అన్‌బాక్సింగ్ ఈవెంట్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.