ఉక్రెయిన్‌పై 70 రోజులుగా…యుద్ధం చేస్తున్న రష్యా…ఎంతో మందిని చంపేసింది. మరెందర్నో నిరాశ్రయులుగా మార్చేసింది. వేలాది ఇళ్లను నేలమట్టం చేసింది. ఇక్కడితో అగని రష్యా సైన్యం… సమాజం సిగ్గుపడే దారుణాలకు ఒడిగడుతోంది. ఎవరేమనుకుంటే…మాకేంటి అనేలా వ్యవహరిస్తోంది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా… రష్యా సైన్యం మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నాయ్. కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి విచారణలో వెల్లడైంది. వీటికి సంబంధించి…