Breaking news Drone Attacks in Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణలో.. తాజాగా కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు రష్యా కజాన్ నగరంలోని భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. రష్యాలోని కజాన్ నగరంలో కనీసం 6 భవనాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు పెద్దెత్తున వైరల్ అవుతున్నాయి.…
న్యూ ఇయర్ వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతీయ రాజధాని డొనెట్స్క్‌లోని జంట నగరమైన మాకివికాలోని వృత్తి విద్యా కళాశాలలో నాలుగు ఉక్రేనియన్ క్షిపణులు తాత్కాలిక రష్యన్ బ్యారక్‌లను తాకినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.