ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు…