అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీపై ఎన్నో అంచనాలు.. ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. ఇద్దరి సమావేశం తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఒక ముగింపు పలుకుతుందని ప్రపంచమంతా ఎదురుచూసింది. కానీ చివరికి ఇద్దరి భేటీ ‘తుస్’ మనిపోయింది.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం 2022 లో ప్రారంభమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే, ఎవరూ విజయవంతం కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇంతలో, రేపు, అంటే ఆగస్టు 15 న, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశం ఈ యుద్ధం పరంగా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో ఇద్దరు నాయకులు…
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధంలో మాస్కో సైనికులతో పాటు పాకిస్థాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తోందని జెలెన్‌స్కీ ఆరోపించారు.
USA: రష్యాతో స్నేహంపై భారత్, చైనాలను భయపెడుతూ ఇటీవల అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్న వారు హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల నాటో చీఫ్ మాట్లాడుతూ.. రష్యాతో చెలిమి భారత్‌ని దెబ్బతిస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనెలటర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తాడని సెనేటర్ లిండ్సే…
Patriot Missile System: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉక్రెయిన్‌కు ‘‘పేట్రియాట్’’ రక్షణ వ్యవస్థను పంపుతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసింది. ఈ పేట్రియాట్ సిస్టమ్స్ కోసం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ కోసం చెల్లిస్తాయని తెలుస్తోంది.
Ukraine War: రష్యా ఉక్రెయిన్‌పై అతిపెద్ద వైమానిక దాడి ప్రారంభించింది. ఈ దాడుల్లో ఒక ఆరుగురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా మొత్తం 537 వైమానిక ఆయుధాలను ప్రయోగించింది. వీటిలో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయి. అయితే, వీటిలో 249ని కూల్చేసినట్లు, మరికొన్నింటిని ఎలక్ట్రానిక్ జామ్ చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ప్రజల ప్రాణాలకు అవసరమయ్యే అన్నింటిని రష్యా టార్గెట్ చేస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో ఆరోపించారు.…
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించినా సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాధినేతలతో చర్చించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అమెరికా విసుగెత్తిపోయింది.
Ukraine Russia War: ఉక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరం టార్గెట్‌గా జరిపిన దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ దేశీయ భద్రతా సంస్థ, సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (SBU) అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఉక్రెయిన్‌పై లాంగ్-రేంజ్ క్షిపణులను ప్రయోగించడానికి మోహరించే Tu-95, Tu-22 వ్యూహాత్మక బాంబర్లతో సహా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ దళాలు నాశనం చేసినట్లు పేర్కొంది.
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యన్ దళాలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడి చేసింది. మొత్తం 367 డ్రోన్లను, క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీలపై దాడులు జరిగాయి. అయితే, ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చేవేసింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా పరిగణించబడుతోంది. Read Also:…
Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం ముగింపుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో, చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ కూడా ప్రకటించింది.