ఉక్రెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారు.. ఓ వైపు యుద్ధం జరుగుతుండడంతో వారి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, కేంద్రం సహకారంతో వారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఉక్రెయినులో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని తెలిపారు ఏపీలో ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు.. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సూచనలు…