Russia Warning to Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి కీవ్ ముందుకు రాకపోతే.. సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.. రాజధాని కీవ్ నగరాన్ని ఇప్పటికే రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.. ఏ క్షణంలోనైనా కీవ్ సిటీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.. రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ పౌరులు వణికిపోతున్నారు.. ఇక, అక్కడ చిక్కుకున్న ఇతర దేశాల పౌరుల్లో ఆందోళన మొదలైంది.. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్‌లో పరిణామాలను, పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక…