Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. శనివారం రాత్రి రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై 200 కి పైగా డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈ దాడులతో ఉక్రెయిన్‌లోని సుమీ, ఖార్కివ్, డ్నిప్రో, జపోరిజ్జియా, ఖ్మెల్నిట్స్కీ, ఒడెస్సా ప్రావిన్సులలో గణనీయమైన నష్టం వాటిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని ఇద్దరు పౌరులు మరణించగా, పది మందికి పైగా గాయపడ్డారు. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధ్యక్షుడు…