ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారుతోంది. ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో అక్కడి పౌరులు, పార్లమెంటు సభ్యులు కూడా యుద్ధానికి మేం రెడీ అంటున్నారు. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు, మహిళా ఎంపీ కిరా రుడిక్ తానూ యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతబట్టారు. ఈ మేరకు ఆమె చాలామందిలాగే తాను కూడా రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నానని అన్నారు. అంతేకాదు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పడం…