రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండోరోజుకు చేరుకుంది.. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిలోకి సైతం రష్యా బలగాలు ప్రవేశించాయి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేలా అడుగులు వేస్తోంది రష్యా.. ఇప్పటికే కొన్ని ఉక్రెయిన్ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్.. మరో 96 గంటల్లో రష్యా చేతిలోకి రాజధాని కీవ్ నగరం పూర్తిస్థాయిలో వెళ్లిపోతుందని తెలిపారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త…
రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్‌మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్-ఉక్రెయిన్ మధ్య…